Site icon NTV Telugu

కోర్టుల నిర్ణయాలకు సామాజిక ప్రభావం ఎక్కువ : సీజేఐ ఎన్వీ రమణ

నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ (నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమానికి సుప్రీంకోర్డు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా తీర్పులు సులభంగా అర్థమయ్యేలా, స్పష్టమైన భాషలో ఉండాలని, న్యాయమూర్తులు సాధరణ భాషలో తీర్పు రాయాలని ఆయన అన్నారు. కోర్టుల నిర్ణయాలకు సామాజికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అట్టడుగు స్థాయిలో పటిష్ట న్యాయవ్యవస్థ ఉండాలని, లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయవ్యవస్థ సాధ్యం కాదన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయవ్యవస్థ మానవీయంగా పనిచేయాలన్నారు. బాధితులు మొదటగా వచ్చేది ట్రయల్ కోర్టుకే అనేదాన్ని గుర్తించాలన్నారు. న్యాయసహాయ ఉద్యమ ప్రోత్సహానికి సహకరించిన రాష్ట్రపతి, ప్రధానికి ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తిత్వం, లోక్‌అదాలత్‌ను ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి సారించాలని ఆయన వెల్లడించారు.

Exit mobile version