Site icon NTV Telugu

Shocking Inciden: కారు డ్రైవ్ చేస్తుండగా..సైడ్ మిర్రర్ నుంచి బయటకు వచ్చిన పాము…

Untitled Design

Untitled Design

బెంగళూరు నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. సైడ్ మిర్రర్ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అయితే ఎలా లోపలికి వెళ్లిందో తెలియదు.. కానీ పాము బయటకు రాగానే షాకైన ఆ.. కారు డ్రైవర్ మిర్రర్ నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతుంది.

Read Also:Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..

అయితే.. పామును చూసిన డ్రైవర్ కాస్త ఆందోళనకు గురయ్యాడు. అనంతరం కారు రోడ్డు పక్కన ఓ సైడ్ కు నిలిపేశాడు. పాము కొద్ది సేపటికి మిర్రర్ లో నుంచి పూర్తిగా బయటకు వెళ్లింది. దీంతో ఊపిరి పీల్చుకున్న డ్రైవర్ వెంటనే కారు తీసుకున్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చలి, వర్షాలు కురుస్తుండటంతో పాములు, ఇతర జీవులు పార్క్ చేసిన వాహనాల్లో వెచ్చదనం కోసం దాక్కుంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా వాహనాల్లో పాములు కనిపిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి వాహనం ప్రారంభించే ముందు జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా చెట్ల కింద, గడ్డిలో, మనం వేసుకునే షూలో కాని, పొడిగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలిని సూచిస్తున్నారు..

Exit mobile version