NTV Telugu Site icon

Air India Express Flight: హమ్మయ్య.. సేఫ్‌గా ల్యాండ్ అయిన విమానం..141 మంది క్షేమం..

Air India (2)

Air India (2)

Air India Express Flight: తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుచ్చి నుంచి టేకాఫ్ అయిన వెంటనే పైలట్ సమస్యను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. విమానంలో మొత్తం 141 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.40 గంటలకు టేకాఫ్ అయింది.

Read Also: Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త..

విమానంలో ఇంధనం భారీగా ఉండటంతో సేఫ్ ల్యాండింగ్ వెంటనే సాధ్యం కాకపోవడంతో తిరుచ్చికి సమీపంలో దాదాపుగా 2.30 గంటలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. విమానంలోని ఇంధనాన్ని తగ్గించారు. ఈ లోపు గ్రౌండ్ సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్య పారామెడిక్ సిబ్బంది, 20 ఫైర్ ఇంజన్లు, 20 అంబులెన్సులు రెడీ చేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Show comments