Site icon NTV Telugu

Smiti Irani: 18 ఏళ్ల నా కూతురిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.

Smriti Irani

Smriti Irani

Smiti Irani comments on congress party, rahul gandhi over illegal bar issue: తన కూతురిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతుందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి అయిన తన కూతురుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని.. ఆమె క్యారెక్టర్ ను హత్య చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 2014, 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడమే తప్పు అని.. అందుకే నా కూతురుపై కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. గోవాలో తన కూతురుకు ఎలాంటి బార్లు లేవని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Congress: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతోంది.

షోకాజ్ నోటీసుల వల్లే కాంగ్రెస్ ఇదంతా చేస్తుందని.. అయితే కాంగ్రెస్ నేతలు చూపెడుతున్న పేపర్లలో నా కూతురు పేరు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆర్టీఐ ద్వారా సాక్ష్యాలు సేకరించానని చెబుతున్నారని..అందులో నా కూతురు పేరు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నా కూతురు అక్రమంగా బార్ నడుపుతుందనే ఆరోపణ దురుద్దేశంతో కూడుకున్నవని స్మృతి ఇరానీ విమర్శించారు. నున్న రాజకీయంగా కించపరిచే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ఇదంతా చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుందని ఆరోపించారు స్మృతి ఇరానీ. రూ.5000 కోట్ల భారత ఖజానా దోపిడిపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించే ధైర్యం నాకుందని సవాల్ విసిరారు. నా కూతురుపై ఆరోపణలు చేసిన పెద్ద మనుసులను న్యాయస్థానాల్లో, ప్రజా కోర్టుల్లో నిలదీస్తానని స్మృతి ఇరానీ సవాల్ చేశారు. 2024లో మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేయాలని..ఆయనను మళ్లీ ఓడిస్తానని.. బీజేపీ కార్యకర్తగా, ఓ తల్లిగా ఇదే నా వాగ్ధానం అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీకి సవాాల్ విసిరారు.

Exit mobile version