రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్‌లు, స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, 12వ తరగతి పాసైన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు ఇస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు 40శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏండ్లుగా కోల్పోయిన అధికారన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోని లేని పరిస్థితి ఉంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తోంది. మరోవైపు బీఎస్పీ, బీజేపీ, ఎస్పీ పార్టీలను ఎదుర్కొనేందుకు సర్వ శక్తులు ఒడ్డుంతుంది.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేస్తోంది. దీంతో యూపీలో పొలిటికల్ హిట్ ను కాంగ్రెస్ పెంచేసింది. ఉత్తర ప్రదేశ్ లో గెలిచి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రయాంక గాంధీని రంగంలోకి దింపింది. ఈ సారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.