తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఆలయ గార్డును పోలీసులు చితకకొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొట్టి చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Bollywood : ప్రైవేట్ ఆల్బమ్స్ తో నెట్టుకొస్తున్న హాట్ బ్యూటీ
తాజాగా ఆలయ గార్డు అజిత్ కుమార్‌ను పోలీసులు కొడుతున్న దృశ్యాలను రహస్యంగా శక్తిశ్వరన్ అనే వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించాడు. ఈ కేసులో కీలక సాక్షి అతడే. ప్రస్తుతం అతనికి బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ బెదిరిస్తు్న్నారు. దీంతో బాధితుడు.. తనకు రక్షణ కల్పించాలంటూ తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్‌కు రెండు పేజీల లేఖ రాశాడు. నిందితులు చాలా శక్తిమంతులని.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Rainy Season Laundry Tips: వర్షాకాలంలో తడి బట్టల దుర్వాసన ఎలా పోగొట్టాలి? ఈ సింపుల్ చిట్కాలు మీకోసం!
జూన్ 28న ఆభరణాల దొంగతనం కేసులో శివగంగ పోలీసులు విచారణ కోసం 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ గార్డును తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో ఐదుగురు పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రహస్యంగా ఒకరు చిత్రీకరించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి వారిపై కూడా ఇలాగే ప్రతాపం చూపించారు. అజిత్ కుమార్ సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడి నోట్లో.. ఒంటిపై కారం చల్లి చితకబాదారని వాపోయాడు. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు.
ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది. శవపరీక్షలో కూడా అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లుగా తేలింది. చెవులు, నోటిలో కారం పొడి చల్లినట్లు కనిపించింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్లుగా ఎలా చేస్తారని కోర్టు నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పౌరుడిని చంపేసిందని వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించద్దని న్యాయస్థానం మండిపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు బదిలీ చేసింది. అంతేకాకుండా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇక స్టాలిన్ స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సారీ చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
