NTV Telugu Site icon

Jharkhand: శ్రీ రామనవమి వేడుకలపై జార్ఖండ్ ప్రభుత్వం ఆంక్షలు.. హజారీబాగ్‌లో ఉద్రిక్తత

Srirama Navami

Srirama Navami

Restrictions on Ram Navami celerations: రామనవమి ఉత్సవాలపై జార్ఖండ్ లోని జెఎంఎం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా హజారీబాగ్ లో దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో మసీదు ముందు ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం హింసకు దారి తీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం రామనవమిపై ఆంక్షలు విధించింది. హజారీబాగ్ లో ప్రతీ ఏటా రామనవమి వేడులకు అట్టహాసంగా జరుగుతాయి. అయితే రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి సంగీతాన్ని పెట్టకూడదని, కర్రలు, వెదురులతో సంప్రదాయ నృత్యాలు నిర్వహించకూడదని, ఆయుధాల విన్యాసాలు చేయకూడదని నగరంలో ఆంక్షలు విధించింది.

Read Also: Bharat Gaurav Train : తొలి భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి

ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని హజారీబాగ్ లోని బాద్కాగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. హిందూ పండగల పట్ల వ్యవస్థ సున్నితంగా ఉండాలని ఆమె అన్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని సామాజిక వ్యవస్థను చెడగొడుతోందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ మాట్లాడుతూ..హిందూ మతం, సంప్రదాయాలకు ముప్పుపొంచి ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి వైఖరి హిందూ సంప్రదాయాలను చంపేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు కట్టుబడి ఉండాలని ప్రజలను జిల్లా ఎస్సీ కోరారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేను అనుమతించబోమని, ఉరేగింపుల్లో ఆయుధాలను అనుమతించేది లేదని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పాటలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు. శ్రీరామ నవమిలో భాగంగా మంగళవారం ‘మంగళ జులు’ ఉరేగింపు ప్రారంభం అయింది. దీంతో హజారీబాగ్ లో 3,000 మంది పోలీసులు మోహరించారు. పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Show comments