Site icon NTV Telugu

Singapore PM Lee Hsien Loong: ఇండియా అందుకనే రష్యా వ్యతిరేక తీర్మానాలకు దూరంగా ఉంది.

Singapore Pm Lee Hsien Loong

Singapore Pm Lee Hsien Loong

Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఫిబ్రవరిలో అమెరికా, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు ప్రతిగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆ సమయంలో భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉంది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం అయిన రష్యా ఫిబ్రవరిలో భద్రతామండలి అధ్యక్షుడిగా ఉండటంతో వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానం ఆమోదించకుండా అడ్డుకుంది. ఆ సమయంలో భారత్ , రష్యా, వియత్నాం, లావోస్ దేశాలు తీర్మాణానికి దూరంగా ఉన్నాయి.

Read Also: Assam: అల్ ఖైదాతో సంబంధాలు.. ఇద్దరు ఇమామ్‌ల అరెస్ట్..

ఆసియాన్ లో అతి చిన్న దేశం సింగపూర్ ఆసక్తులు, ప్రాముఖ్యతలు సహజంగా ఇతరుకలు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. సింగపూర్, రష్యా దండయాత్రను ఖండించమే కాకుండా.. ఆంక్షలను విధించేందుకు ముందుకు వెళ్లిందని లీసింగ్ లూంగ్ అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని ఖండించడంలో సింగపూర్, అమెరికా వైపు కానీ రష్యా వైపు కానీ పక్షపాతం చూపడం లేదని అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని సింగపూర్ ఖండించకపోతే.. ఒక రోజు మనపై దాడి చేస్తే సింగపూర్ వైపు కూడా ఎవరూ నిలబడరని ఆయన అన్నారు.

మార్చిలో ఉక్రెయిన్ మానవతా సంక్షోభంపై రష్యా చేసిన ముసాయిదా తీర్మానంపై కూడా భారత్ గైర్హాజరైంది. ఆ సమయంలో రష్యా, చైనా తీర్మాణానికి మద్దతుగా ఓటేయగా.. భారత్ తో సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో భద్రతా మండలిలో రెండు పర్యాయాలు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి గైర్హాజరైంది.

Exit mobile version