Site icon NTV Telugu

Simran Singh: పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..

Simran Singh

Simran Singh

Simran Singh: పాపులర్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్‌జే సిమ్రాన్ సింగ్ తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. బుధవారం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47 వద్ద అద్దె అపార్ట్‌మెంట్‌లో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సిమ్రాన్‌ని మొదటగా పార్క్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె చనిపోయినట్లుగా ప్రకటించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే, ఆమె కుటుంబం మాత్రం ఆమె ఆత్మహత్యను తిరస్కరించింది. మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తి చేసింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సిమ్రాన్ మృతిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

Read Also: Annamalai: అన్నామలై సంచలన ప్రకటన.. డీఎంకేను గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని శపథం

ఇన్‌స్టాలో ఆమెకు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌కి చెందిన సిమ్రాన్ అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రీలాన్స్ రేడియో జాకీ. ఆర్‌జే సిమ్రాన్ అని ఆమె అభిమానులు పిలుస్తుంటారు. 25 ఏళ్ల ఆమె చివరిగా డిసెంబర్ 13న రీల్ పోస్ట్ చేసింది. జమ్మూ ప్రాంత వాసి కావడంతో, ఆమెను అభిమానునలు ‘‘జమ్మూ కీ ధడ్కన్’’ అని పిలుస్తుండేవారు.

Exit mobile version