దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తరువాత దేశంలో కేసులు 60 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే, అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో కోవావ్యాక్స్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ తయారు చేస్తున్నది. మూడో దశ ట్రయల్స్ లో 90శాతానికి పైగా సమర్ధత ఉన్నట్టు రుజువైంది. ట్రయల్స్ పూర్తిచేసుకొని అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తే డిసెంబర్ నాటికి 20 కోట్ల కోవావ్యాక్సిన్ లను తయారు చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ ప్రకటించింది.
డిసెంబర్ నాటికి 20 కోట్ల కోవావ్యాక్స్ డోసులు…
