అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఓవైపు పాలక కాంగ్రెస్.. మరోవైపు ఆప్, ఇంకో వైపు అమరీందర్‌సింగ్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారి ఉన్నారు.. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్‌యుద్ధం మాత్రం ముగియడంలేదు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తానే సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటు తప్పకపోగా.. సిట్టింగ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవంటూ ఇద్దరు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నా.. తాజాగా, సిద్ధూ కూతురు రబియా సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారియి.
Read Also: Revanth Reddy: మోడీని నిలదీసేందుకు కేసీఆర్‌కు అంత భయమెందుకు..?
అమత్ సర్ నియోజకవర్గంలో ఇవాళ ప్రచారం నిర్వహించారు రబియా సిద్ధూ.. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకునేది లేదని ప్రకటించారు.. ఇక, ఇదే సమయంలో సీఎం చన్నీని టార్గెట్ చేశారు రబియా… ముఖ్యమంత్రి చన్నీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆమె.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తే.. రూ.133 కోట్లు ఉంటాయంటూ బాంబ్ పేల్చారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తే అయితే.. ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించిన ఆమె.. తన తండ్రి కాంగ్రెస్ కోసం ఎంతో చేశారని.. పంజాబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమై.. రచ్చగా మారినట్టు అయ్యింది.
