Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ ప్రచారం
- మీడియాకు క్లారిటీ ఇచ్చేసిన సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశాక.. దేశ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని… ఈ సందర్భంగా రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లే ప్రసక్తే లేదని.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలనే ఆఫర్ వచ్చినప్పటికీ మర్యాదపూర్వకంగా దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.
“నన్ను రాజ్యసభకు వెళ్లమని అడిగారు. కానీ నేను వెళ్లలేనని వినయంగా చెప్పాను. నాకు రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి ఉంది. ప్రజలు నన్ను ఐదేళ్ల పాటు ఎన్నుకున్నారు. ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నాయి. ఎమ్మెల్యేగా నేను ఇక్కడే ఉంటాను” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
తాను ఎప్పటినుంచో హైకమాండ్ ఆదేశిస్తే రాజీనామా చేస్తానని చెబుతూ వచ్చానని గుర్తుచేశారు. “రెండు రోజుల క్రితం హైకమాండ్ పదవి వీడాలని ఆదేశించింది. అందుకే ఈరోజు రాజీనామా చేశాను. కర్ణాటక ప్రజలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
గురువారం ఉదయం తన నివాసంలో మంత్రివర్గ సహచరులకు ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు డీకే శివకుమార్ తన వారసుడిగా బాధ్యతలు చేపడతారని మంత్రులకు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!