Site icon NTV Telugu

Karnataka: మహిళలకు ఫ్రీ బస్‌పై కర్ణాటక సీఎం క్లారిటీ!

Siddaramaiah

Siddaramaiah

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది. దీపావళి పండుగ రోజున మహిళలకు షాక్ తగిలినట్లైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పున:సమీక్షిస్తామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. కొంత మంది మహిళలు డబ్బులు చెల్లించి ప్రయాణం చేస్తామంటూ మెయిల్స్ పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో పెను దుమారం రేపాయి.

ఇది కూడా చదవండి: IPL Retention 2025: 10 ప్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్‌ ఇదే!

తాజాగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ‘శక్తి’ పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డీకే శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం స్వయంగా సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదని.. డీకే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో తాను లేనన్నారు.

ఇది కూడా చదవండి: IPL Retention 2025: ముగ్గురు టీమిండియా స్టార్లకు షాక్.. కెప్టెన్సీ పాయే

Exit mobile version