Site icon NTV Telugu

Shubhanshu shukla: భూమి మీదకు శుభాన్షు శుక్లా తిరిగి రావడం వాయిదా.. ఆరోజే వచ్చేది..!

Shubansh

Shubansh

Shubhanshu shukla: ఆక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14వ తేదీన భూమి పైకి తిరిగి రాబోతున్నారని నాసా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ గురువారం నాడు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, ఆక్సియం-4 మిషన్ పురోగతిని క్షణ్ణంగా పరిశీలిస్తు్న్నామని, దానిని ఈనెల 14వ తేదీన అన్ డాక్ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read Also: Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రారంభం.. iPad, టాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్ ఇదిగో..!

కాగా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25వ తేదీన ఆక్సియం-7 మిషన్ ను నాసా ప్రయోగించింది. మరుసటి రోజు ఐఎస్ఎస్ లో అస్ట్రోనాట్స్ విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. అప్పటి నుంచి శుభాన్షు శుక్లా సహా ఇతర వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో పలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. అయితే, వారు జూలై 10వ తేదీనే భూమి పైకి తిరిగి రావాల్సి ఉండగా.. దానిని జూలై 14వ తేదీకి వస్తున్నారని నాసా వెల్లడించింది. భూమి మీదకు వచ్చిన తర్వాత వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

Exit mobile version