Shraddha Walker: శ్రద్ధా వాకర్ ఈ పేరు దేశం ఎప్పటికీ మరిచిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ‘‘లివ్-ఇన్ రిలేషన్’’లోని మరో కోణాన్ని ఆమె దారుణ హత్య వెలుగులోకి తెచ్చింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆమె అతడి బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చేతిలో అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది. ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ శివారులోని పారేశాడు.
Read Also: Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
ఇదిలా ఉంటే, శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ ముంబైలోని వాసాయి ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. తన కుమార్తె మరణానికి న్యాయం చేయాలని వేడుకున్న ఆయన మరణించడం విషాదంగా మారింది. సన్నిహితుల ప్రకారం.. ఇప్పటికీ ఆయన షాక్‌లోనే ఉన్నారని చెప్పారు. నిజానికి శ్రద్ధా వాకర్ కనిపించడం లేదని వికాస్ వాకర్ చేసిన ఫిర్యాదు ద్వారానే ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ కూతురి అస్థికలను దహానం చేయాలనుకున్నాడు, కానీ చాలా కాలంగా కోర్టులో కేసు విచారణలో ఉండటం వల్ల సాధ్యం కాలేదు. శ్రద్ధా అస్థికలు దొరకకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. 18 మే 2022న జరిగిన ఈ సంఘటన దేశాన్ని కుదిపేసింది. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత అంటే నవంబర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె శరీరాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, ముక్కలను రోజుల తరబడి అటవీ ప్రాంతంలో పారేశాడు. ప్రస్తుతం నిందితుడు అఫ్తాబ్ ఢిల్లీ జైలులో ఉన్నారు. ఇప్పటికీ అతడికి ఎలాంటి శిక్ష విధించబడలేదు. శ్రద్ధా తండ్రి తన కూతురి అస్థికల కోరుతూనే ఉన్నాడు, కానీ అతను మరణించే వరకు కూడా అవి అందలేదు.