Gutka ad case: పొగాకు ఆరోగ్యానికి హానికరం. అలానే ప్రాణాంతకం. సినిమా ప్రారంభమైయ్యే ముందు స్క్రీన్ పైన ముకేశ్ యాడ్ తప్పనిసరి. అయితే సినిమా ప్రారంభంలో ముకేశ్ యాడ్.. టెలివిజన్ తెర పైన మన గుట్కా తినండి సువాసన వెదజల్లండి అంటూ మన అభిమాన హీరోల యాడ్. అయితే ఈ యాడ్ ఏ బాలీవుడ్ అగ్ర నటులను చిక్కుల్లో పడేసింది. వివరాలలోకి వెళ్తే.. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ బడా హీరోలైనటువంటి షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ నటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ విషయాన్నిఅలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.
Read also:Mythri Movies Makers: రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా గదర్ హీరో చేతికి?
అయితే భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకుని ఉన్నత స్థాయిలో ఉన్న అగ్ర నటులు ఇలా ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు ముగ్గురు బాలీవుడ్ అగ్ర హీరోలు అయినటువంటి అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు.