Mythri Movies Makers: రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా గదర్ హీరో చేతికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టుగా టాక్ నడుస్తోంది. అసలు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసి… ఈ సినిమాను హోల్డ్ చేయడం ఏంటి? రవితేజ సినిమాకి బడ్జట్ ఇష్యూస్ ఏంటి అనేది రవితేజ అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది.
#RT4GM ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టడం గురించి మైత్రీ మూవీ మేకర్స్ నుంచైతే ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం ఈ సినిమాను మరో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే గదర్ 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సన్నీ డియోల్ తో ప్రాజెక్ట్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సన్నీ డియోల్ హీరో అయితే బడ్జట్ విషయంలో జరగాల్సిన మార్పులు గురించి లెక్కలు వేసే పనిలో ఉన్నారు మేకర్స్. అన్నీ కుదిరితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కథ రవితేజ కోసం రాసుకున్న కథేనా కాదు అనేది మైత్రీ మూవీస్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Also Read
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!