Site icon NTV Telugu

Maharashtra Politics : గంట గంటకు మారుతున్న ‘మహా’ రాజకీయాలు..

Shivsena

Shivsena

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు గంట గంటకు మారుతున్నాయి. ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే.. మరొపక్క ఇదే సందు అన్నట్లుగా బీజేపీ అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా కాషాయజెండాను ఎగురవేయాలనే ఆశతో ఉన్న బీజేపీ ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు మాతో కలిసివస్తే.. కీలక పోర్ట్‌పోలియో కట్టబెడుతామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శివసేన ఎంపీలు సైతం మాకు మద్దతు ఇస్తే రెండు కేంద్రమంత్రి పదవులను కూడా ఆఫర్‌ చేసింది బీజేపీ. ఇదిలా ఉంటే.. శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యాలు మరింత రాజకీయ దుమారం రేపుతున్నాయి.

అయితే.. మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్‌ రౌత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్‌లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న సంజయ్‌ రౌత్‌.. వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏకానాథ్‌షిండే శిబిరంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version