శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటు ఆ తర్వత పరిణామలు ఉత్కంఠరేపుతుండగా.. రెబల్ ఎమ్మెలె్యేలపై హాట్ కామెంట్లు చేశారు సంజయ్ రౌత్.. జులై 11వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలను గౌహతిలోనే ఉండమని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. అంటే జులై 11 వరకు రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్రలో పని లేదు అని సెటైర్లు వేశారు.. మహారాష్ట్ర పరిణామాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. విచారణను జులై 11కు వాయిదా వేసింది.. విచారణ తిరిగి జూలై 11న జరగనున్న నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్ఏలు గౌహతిలోనే వుంటారంటా సెటైర్లు వేశారు సంజయ్ రౌత్..
Read Also: KCR: లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ భవన్‌లో అడుగుపెట్టిన కేసీఆర్.. ఆసక్తికర సన్నివేశాలు..
మరోవైపు ముంబైలోని పార్టీ ఎమ్మెల్యేలను పిలిచింది మహారాష్ట్ర బీజేపీ.. శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే గ్రూప్ సభ్యులతో కలిసి గవర్నర్ ను కలవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణం సర్కార్ మైనార్టీలో పడిందని.. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేలా ఆదేశించాలని గవర్నర్‌ను కోరే యోచనలో ఉంది బీజేపీ.. ఇక, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మహారాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఉద్ధవ్ కేబినెట్‌లోని కొందరు మంత్రులు రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌లో ఉన్న విషయం తెలిసిందే.