Ship hijacked: 15 మంది భారత సిబ్బంది ఉన్న లైబీరియన్ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. హైజాక్‌కి సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత ఇండియన్ నేవీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. హైజాక్ అయిన ఎంవీ లిలా నోర్‌ఫోక్ నౌకపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై పరిస్థితిని పరిష్కరించడానికి హైజాక్ చేసిన ప్రాంతానికి వెళుతోంది.
Read Also: Pregnancy termination: భర్త మరణంతో కుంగిపోయిన భార్య.. 27 వారాల గర్భం రద్దుకు హైకోర్టు అనుమతి..
షిప్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో షిప్ హైజాకింగ్ ప్రయత్నాలకు సంబంధించి ఇండియన్ నేవీ వేగంగా స్పందించింది. ఈ నౌకలో గురువారం సాయంత్రం ఐదు నుంచి ఆరుగురు సాయుధుల ఉనికి ఉన్నట్లు సందేశం అందింది.
సోమాలియా తీరంలో సముద్ర దొంగలు వాణిజ్య ఓడలను హైజాక్ చేసి, వాటిని విడిపించుకునేందుకు సంబంధిత యాజమాన్యం, దేశాలను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2008 నుంచి 2013 మధ్య ఈ పెరెట్స్ దాడులు పెరిగాయి. అయితే ఇండియన్ నేవీతో సహా మల్టీ-నేషనల్ మారిటైమ్ టాస్క్‌ఫోర్స్ సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.