NTV Telugu Site icon

Eknath Shinde: డిప్యూటీ సీఎంపై తేల్చని షిండే.. అజిత్ పవార్‌పై చురకలు..

Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. రేపు సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎన్డీయే నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ రాధాకృ‌ష్ణన్‌కి కలిసిన మహాయుతి నేతలు, ప్రభుత్వ ఏర్పాటును కోరారు. మరోవైపు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..

తాజాగా, మీడియా సమావేశంలో మాట్లాడిని ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవిపై ఎటూ తేల్చలేదు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా..? అనే ప్రశ్నలకు సమాధానంగా సాయంత్రం వరకు ఆగండి అని అన్నారు. అజిత్ పవార్ కల్పించుని ‘‘సాయంత్రం వరకు ఆయన అవగాహన వస్తుంది, నేను మాత్రం ప్రమాణస్వీకారం చేస్తా, వేచి ఉండను’’అని అన్నారు. అజిత్ పవార్ వ్యాఖ్యలకు షిండే చురకలు అంటించారు. ‘‘దాదా(అజిత్ పవార్) ఉదయం, సాయంత్రం రెండు సార్లు ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉంది’’ అంటూ సెటైర్ వేశారు. 2019లో ఒకసారి బీజేపీకి మద్దతుగా, ఆ తర్వాత కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ ప్రభుత్వం ‘‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’’కి మద్దతుగా ప్రమాణస్వీకారం చేయడాన్ని ఉదహరించారు.

అజిత్ పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడానికి మేము మా వంతు కృ‌షి చేస్తామని, పార్టీ కార్యక్రమాలను బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, ఎన్సీపీ నేత సునీల్ తట్కరే నిర్వహిస్తారని చెప్పారు. ప్రమాణస్వీకారం గురించి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రేపు సాయంత్రం 5.30 గంటలకు కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని.. రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారో సాయంత్రంలోగా నిర్ణయిస్తామని, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఉండాలన్నది మహాయుతి కార్యకర్తల కోరిక అని, ఆయన మా వెంట ఉంటారనే నమ్మకం ఉందని, మహారాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ తనకు మద్దతు ఇచ్చారని ఫడ్నవీస్ తెలిపారు.

Show comments