NTV Telugu Site icon

EY Employee Death: నిద్రకు, తినడానికి సమయం లేదు, ఫోన్ చేసి ఏడ్చేది.. అన్నా సెబాస్టియన్ తండ్రి..

Anna Sebastian Perayil Death

Anna Sebastian Perayil Death

EY Employee Death: అన్నా సెబాస్టియన్ పెరాయిల్ అనే 26 ఏళ్ల యువతి మరణం ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియాలో సీఏగా పనిచేస్తున్న అన్నా ‘‘పని ఒత్తిడి’’ కారణంగా మరణించిన ఘటన ఇప్పుడు కార్పొరేట్‌లో చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. ఆఫీస్ కల్చర్ యువ ప్రాణాలు ఎలా బలి తీసుకుందనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే దాన్ని వెలుగులోకి తెచ్చింది. కేరళకు చెందిన అన్నా, పూణేలో సీఏగా పనిచేస్తోంది.

అన్నా సెబాస్టియన్ మరణం వర్క్ కల్చర్‌లో రాబోయే మార్పులకు కారణమవుతుందా.? అనేది తర్వాత విషయం కానీ, ఆమె మరణం మాత్రం కార్పొరేట్ వరల్డ్‌లో తాము ఎలాంటి బాధల్ని అనువిస్తున్నామనే విషయాలను పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొందరు కార్పొరేట్ జాబ్ వద్దు అని చెబుతున్నారంటే అందులో ఎలాంటి ఒత్తిడి ఉందో తెలుస్తోంది.

Read Also: Mrunal Thakur: బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్ !

తాజాగా అన్నా తండ్రి సిబి జోసెఫ్ తన కూతురు ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఒక్కోసారి ఫోన్ చేసి ఏడ్చేదని జోసెఫ్ శనివారం చెప్పారు. తాను చాలా సార్లు రాజీనామా చేసి వచ్చేయాలని చెప్పినప్పటికీ, ఈవై కంపెనీలో ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుందని చెప్పేదని, అందుకే ఆ సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించుకుందని చెప్పారు. అన్నా జోసెఫ్ జూలై 21న తన ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. సహోద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించారు, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించింది.

తన కూతురు అర్థరాత్రి వరకు పనిచేసేదని, ఆమె హాస్టల్‌కి తిరిగి వచ్చిన తర్వాత కూడా సంబంధం లేని ఇతర పనులు కూడా చేసేదని చెప్పారు. తన కూతురు నిద్రించడానికి, తినడానికి సమయం కూడా దొరకతనంత ఒత్తిడికి గురైందని ఆవేదన వెల్లగక్కారు. ‘‘ఆమె అక్కడ మార్చి 18న చేరింది. ఒక వారం తర్వాత ఆమె రెగ్యులర్ ఆడిటింగ్ ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి, ఆమెను 6 వ బృందంలో చేర్చారు. ఆడిట్ మేనేజర్ ఆమె పనిని సమీక్షించాలి. ఆమె రాత్రంతా పనిచేయాల్సి వచ్చేది. హాస్టల్ చేరిన తర్వాత కూడా పనితో సంబంధం లేని అదనపు పనులు చేసేది’’ అని అన్నా తండ్రి చెప్పారు.

‘‘మేనేజర్ పనిని సమీక్షించలేదు, అతను క్రికెట్ అభిమాని, క్రికెట్ షెడ్యూల్‌కి అనుగుణంగా తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేవాడు. దాని కారణంగా ఆమె తన పనిని చేయాడానికి మరింత ఆలస్యమయ్యేది’’ అని జోసెఫ్ చెప్పారు. EY యొక్క పని సంస్కృతి మరియు అధిక పనిభారం తన కుమార్తె మరణానికి కారణమని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి రాసిన హృదయ విదారక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్నా మరణం వెలుగులోకి వచ్చింది.