NTV Telugu Site icon

Kolkata doctor Case: “ఒంటిపై దుస్తులు లేవు, తీవ్రగాయాలు”.. అయినా, ఆత్మహత్య అని చెప్పారు..

Kolkata Doctor

Kolkata Doctor

Kolkata doctor Case: కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నగరంలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్‌పై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. గత శుక్రవారం తెల్లవారుజామున కాలేజీలోని సెమినార్ హాలులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు పాల్పడినట్లు ఆరోపించిబడుతున్న వ్యక్తి సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ప్రైవేట్ భాగాలు, కళ్లు, నోరు నుంచి రక్తస్రావం జరిగిందని, ఆమె మెడ ఎముక విరిగిందని, బోడ్డు, చేతి వేలుపై గాయాలు, ముఖంగాపై గాయాలు ఉన్నట్లు, లైంగిక దాడి జరిగినట్లు నివేదిక వెల్లడించింది.

అయితే, ఈ కేసులో కోల్‌కతా పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో కలకత్తా హైకోర్టు ఈ కేసును నిన్న సీబీఐకి అప్పగించింది. ఈ రోజు సీబీఐ అధికారుల కేసు విచారణ ప్రారంభించారు. ఇదే కాకుండా ఆమె కాళ్లు 90 డిగ్రీల దూరంలో ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆస్పత్రికి వచ్చిన ఆమె బంధువులు ఆరోపించారు. కటి భాగంలో విరిగితే తప్పా ఇది జరగదని, ఆమెపై అత్యంత హేయంగా దాడి జరిగింది, శరీరంపై బట్టలు కూడా లేవని ఆమె బంధువులు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక నిందితుడి పని కాదని, ఎక్కువ మంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..

ఆమె దారుణంగా గాయపడినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా చెబుతూ తమకు కాల్ వచ్చినట్లు వారు ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్‌జీ కర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు బాధితురాలి తండ్రి చెప్పారు. ఇదిలా ఉంటే ఈ కేసు బెంగాల్‌లో పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ కేసులో అంతుచిక్కని అనుమానితులకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోని మమతా బెనర్జీ యొక్క విశ్వసనీయులతో దగ్గరి సంబంధం ఉందనే పుకార్ల ఉన్నాయిన బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపించారు. మరోవైపు కోల్కతా పోలీసులు పుకార్లను వ్యాప్తి చేయడం మానుకోవాలని ప్రజల్ని కోరారు.

తాము తమ బిడ్డ మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రి ముందు 3 గంటలు నిరీక్షించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘‘ ముందుగా ఆస్పత్రి వర్గాలు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని మీరు వెంటనే రావాలని చెప్పారు’’ అని వైద్యురాలి తండ్రి చెప్పారు. 3 గంటలు బయట వేచిచూసేలా చేశారు. మా కుమార్తె ముఖాన్ని చూపించాలని వేడుకున్నా గంటల కొద్దీ వేయిట్ చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో బాధితురాలి చేతులు, ముఖంపై కోసుకుపోయిన గుర్తులు ఉన్నాయి. ఆమె తలను గోడకు బలంగా కొట్టడంతో తలకు గాయాలయ్యాయని తేలింది.

Show comments