Site icon NTV Telugu

Shashi Tharoor: శశిథరూర్ యూటర్న్.. ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షం

Shashi Tharoor

Shashi Tharoor

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే అనుమతి లేదంటూ బారీకేడ్లు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో మహిళా ఎంపీలు, అఖిలేష్ యాదవ్ బారీకేడ్లు దూకే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే ఆశ్చర్యంలో కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉండే శశిథరూర్ అనూహ్యంగా రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొ్న్నారు. ఈసీ ఆఫీస్‌కు చేపట్టిన మార్చ్‌లో శశిథరూర్ కూడా ప్రత్యక్షమయ్యారు.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి మిస్సింగ్.. ఆచూకీ కోసం కేంద్రానికి లేఖ

చాలా కాలంగా శశిథరూర్ బీజేపీతో కలిసి తిరుగుతున్నారు. ఇటీవల కేంద్ర తరపున దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సిందూర్ గురించి తెలియజేశారు. అంతేకాకుండా నిత్యం బీజేపీ నేతలతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుంటారు. ఇక సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటిది సోమవారం ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీలో పాల్గొని ఆశ్చర్యపరిచారు.

ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో విపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. తనిఖీలు చేశాకే ఓట్లు తొలగించినట్లు చెప్పింది. ఇక ఇటీవల గత లోక్‌సభ ఎన్నికల్లో మోసం జరిగిందంటూ కర్ణాటకలో జరిగిన ఘటనను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. అయితే దీనిపై రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. అయితే తాము అడిగిన సమాచారం ఇవ్వాలంటూ తాజాగా ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టారు.

Exit mobile version