Sharad Pawar: ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఛాతిలో నొప్పితో సోమవారం పూణేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దగ్గు వచ్చిన తర్వాత ఆయన ఛాతిలో నొప్పి రావడంతో రూబీ హాల్ క్లిన్‌కు తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే వెల్లడించారు.
85 ఏళ్ల శరద్ పవార్‌కు ప్రస్తుతం డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె ఎక్స్‌లో తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని కీలక అంశాలు నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. శరద్ పవార్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పుర్వేజ్ కె. గ్రాంట్ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యలోల భాగంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు. శరద్ పవార్‌కు ఫ్లూరిటిక్ పెయిన్ వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఛాతిలో నొప్పి మరింత ఎక్కువయ్యే లక్షణాన్ని ఫ్లూరిటిక్ పెయిన్‌గా చెబుతుంటారు.
Baba has been admitted to Ruby Hall Clinic, Pune, following a bout of cough. He is undergoing medical tests, and all his health parameters are stable.
Thank you all for your concern and good wishes.
— Supriya Sule (@supriya_sule) November 2, 2026

