Site icon NTV Telugu

యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. శరద్ పవార్‌ కీలక వ్యాఖ్యలు

Sharad Pawar

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలంటున్నారు నేషలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్.. ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని కోరిన ఎన్సీపీ చీఫ్.. ఈ ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఓట్లు చీలిపోకుండా సాధ్యమైనంత వరకు తగ్గించేలా చూడడం ఎంతో కీలకం అని.. దానికోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. దేశ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్‌ ఖేరి ఘటనపై స్పందించిన శరద్ పవార్.. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయని.. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీతో సహా కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి.. ప్రభుత్వం ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్.

Exit mobile version