NTV Telugu Site icon

Air India Urination Case: మూత్ర విసర్జన కేసులో ఊహించని కోణం.. ట్విస్ట్ ఇచ్చిన మిశ్రా

Air India Urination Case

Air India Urination Case

Shankar Mishra Says That He Did Not Pee On Woman In Patiala Court: ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు శంకర్ మిశ్రా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మద్యం మత్తులో తాను 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్రం పోశానన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తాను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించనేలేదని కుండబద్దలు కొట్టాడు. ఆ వృద్ధురాలే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకొని, తనపై ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు శుక్రవారం ఢిల్లీ పాటియాలా కోర్టుకు వెల్లడించాడు. కోర్టులో మిశ్రా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ వృద్ధురాలు తన సీట్లో తానే మూత్ర విసర్జన చేసిందని తెలిపారు. 30 ఏళ్లుగా ఆమె భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని అన్నారు.

90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే

కాగా.. గతేడాది నవంబర్‌ 26వ తేదీన న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా మద్యం మత్తులో తన తోటి ప్రయాణికురాలైన ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డిసెంబర్ 4వ తేదీన వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు గురించి తెలుసుకున్నాక.. శంకర్ మిశ్రా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం పారిపోయాడు. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత.. బెంగళూరులో అతడ్ని అరెస్ట్ చేశారు. కోర్టులో మిశ్రా బెయిల్ పిటిషన్ వేసుకోగా, దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా.. తాను ఆ వృద్ధురాలిపై మూత్రం పోయేలేదంటూ పై విధంగా స్పందించి, అందరినీ షాక్‌కి గురి చేశాడు.

India vs New Zealand: ఇండియా vs న్యూజీల్యాండ్ మ్యాచ్.. పేటీఎంలో టికెట్స్