NTV Telugu Site icon

Marriage Cancel: కొంపముంచిన షాంపూ.. 6 గంటల్లో జరగాల్సిన పెళ్లి పెటాకులు

Marriage Cancel

Marriage Cancel

Shampoo canceled the wedding: ఇటీవల కాలంలో చిన్నచిన్న విషయాలకు పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. మండపం వరకు వచ్చిన వివాహాలు రద్దు అవుతున్నాయి. ఈగో ప్రాబ్లమ్స్, చిన్నచిన్న విషయాలను పెద్దదిగా చేసి చూస్తుండటంతో పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయి. ఇటీవల ఇలాగే ఓ యువతి ‘లెహంగా’ నచ్చలేదని చెబుతూ ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంది. అత్తింటి వారు పంపిన లెహంగా చీప్ గా ఉందని చెబుతూ, తల్లి మాటలు విని పెళ్లిని రద్దు చేసుకుంది. అయితే చివరకు తన తప్పిదాన్ని గ్రహించి వరుడి కుటుంబాన్ని బతిమిలాడిన ప్రయోజనం లేకపోయింది. ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు సర్దిచెప్పిందుకు ప్రయత్నించినా.. పెళ్లి కూతురు చేసిన దానికి మళ్లీ వారితో సంబంధాన్ని కలుపుకునేందుకు వరుడి కుటుంబం ససేమిరా అంది.

Read Also: Imran Khan: పాకిస్తాన్ మునిగిపోతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింటి వారు పెట్టిన వస్తువుల్లో చౌకైన ‘షాంపూ’ ఉందని ఆరోపిస్తూ పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన అస్సాంలో జరిగింది. అస్సాం బర్పెట జిల్లాలకు చెందిన యువతికి, గౌహతికి చెందిన ఇంజనీర్ తో వివాహం నిశ్చయం అయింది. పెళ్లి కొడుకు కుటుంబం వధువుకు కొన్ని బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అయితే దీంట్లో తక్కవ ధర షాంపూ ఉండటంతో.. వధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నీస్థాయి ఇంతేనా అంటూ వాట్సాప్ పంపింది. దీంతో షాక్ కు గురైన వరుడు మరో 6 గంటల్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నాడు.

ఈ ఘటన ఈ నెల 14న జరిగింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అబ్బాయి తరుపు బంధువులను అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు యత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో ఈ పెళ్లి వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.

Show comments