NTV Telugu Site icon

Himanta Biswa Sarma: నిన్న షారుఖ్ తెలియదన్నారు.. ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు

Himanta On Shahrukh

Himanta On Shahrukh

Shahrukh Khan Called Assam CM Himanta Biswa Sarma On Theatre Incident: శనివారం ఓ మీడియా సమావేశంలో తనకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఎవరో తెలియదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ షారుఖ్‌తోనే తాను ఫోన్‌లో మాట్లాడానని ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం 2 గంటలకు తనకు షారుఖ్ ఫోన్ చేసి, గువహటిలో పఠాన్ సినిమాను ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వందేనని తాను భరోసా ఇచ్చానని ట్విటర్ మాధ్యమంగా వివరించారు. ఆ ఘటనపై తాము విచారణ జరుపుతామని, అలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తాను షారుఖ్‌కి హామీ ఇచ్చామని తెలిపారు.

Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి

కాగా.. శనివారం నిర్వహించి మీడియా సమావేశంలో షారుఖ్ గురించి మీడియా ప్రతినిధులు హిమంతను ప్రశ్నించగా, అసలు తనకు షారుఖ్ ఎవరో తెలియదని బాంబ్ పేల్చారు. బాలీవుడ్ నుంచి తనకు చాలామంది ఫోన్ చేస్తుంటారని, కానీ ఇప్పటిదాకా ఆ ఖాన్ పేరుతో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పారు. ఒకవేళ అతడు ఫోన్ చేస్తే, తాను తప్పకుండా సమస్యల గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే షారుఖ్ ఫోన్ చేయడం గమనార్హం. ఇదిలావుండగా.. ఈనెల 25వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న పఠాన్ సినిమాపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే! బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణె కాషాయం రంగు బికినీ ధరించడమే అందుకు కారణం. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై చర్చించేందుకు హిమంతకు షారుఖ్ ఫోన్ చేశారు.

Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో 3000 పేజీల ఛార్జిషీట్

Show comments