Site icon NTV Telugu

Shahjahanpur Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ నదిలో పడి 12 మందికి పైగా మృతి

Up Accident

Up Accident

Shahjahanpur Accident: ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్రా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. 42 మందితో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా వంతెనపై నుంచి కింద పడింది. తిల్హార్ పోలీస్ స్టేషన్‌లోని బిర్సింగ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అజ్మత్ పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు సమీప గ్రామంలో ఏర్పాటు చేసిన భగవత్ కథకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Etela Rajender: కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

ఇద్దరు ట్రాక్టర్లు వేగంలో పోటీ పడి ప్రయాణిస్తుండటంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల్లో పలువురు పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు పరిహారాన్ని అందించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version