NTV Telugu Site icon

Republic Day TerrorAttack: ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే 5లక్షల డాలర్లు ఇస్తా ఎస్‌ఎఫ్‌జే ప్రకటన

Republic Day

Republic Day

Republic Day TerrorAttack: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు పాల్పడతానంటూ సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)కి చెందిన గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్‌వంత్‌సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశమంతా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా.. సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జే) ఉగ్రవాద సంస్థ గురుపత్వంత్ సింగ్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక పంజాబ్ అనుకూల సంస్థ అయిన SFJ తీవ్రవాద దాడులకు పాల్పడుతుందనేది ఈ వీడియో సారాంశం.

వీడియోలో ఏముందంటే..

జనవరి 26న ఇంట్లోనే ఉండండి, లేదంటే భారీ మూల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మా లక్ష్యం. అదే రోజు ఖలిస్తాన్ జెండాను ఆవిష్కరిస్తాం” అని గురుపత్వంత్ సింగ్ వీడియోలో తెలిపారు. ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేసిన వారికి 5 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. 2023లో భారత్ నుంచి పంజాబ్ ను వేరు చేస్తామని తెలిపాడు. ఈ నేపథ్యంలో వినీత్ జిందాల్ అనే న్యాయవాది గురుపత్వంత్ సింగ్‌పై ఎస్‌ఎఫ్‌జే సంస్థతో కలిసి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. వీడియో చూసి షాక్ తిన్నానని, స్థానికంగా ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దారుణమని అన్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Read also: Nampally Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం.. ఐదు కార్లు దగ్ధం

ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్‌వంత్‌సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుపత్వంత్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు SFJని కూడా నిషేధించింది. గత ఏడాది కూడా గురుపత్వంత్‌పై రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
TSPSC AEE Exam: నేడే ఏఈఈ రాతపరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య సూచనలివే..

Show comments