Site icon NTV Telugu

‘సుప్రీం’లో కోవిడ్‌ కలకలం.. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం

భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్‌ ఎఫెక్ట్‌ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్‌ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజు వారిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 30 శాతం మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది..

Read Also: ఇక, అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కోవిడ్‌ టెస్ట్‌లు..

సుప్రీం కోర్టు సిబ్బంది సుమారు 1500 మంది ఉండగా, అందులో 400 మందికి ఇప్పటికే కోవిడ్‌ సోకింది.. ప్రతి రోజు 100 నుంచి 200 వరకు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యసిబ్బంది. ఇక, రోజువారి అత్యవసర కేసుల విచారణ జరిపేందుకు ధర్మాసనాలను ఏర్పాటు చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పాలనాపరంగా పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు.. న్యాయమూర్తులు, పాలనా సిబ్బంది ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.

Exit mobile version