Site icon NTV Telugu

Bengal Liquor Deaths: 7గురిని కబళించిన కల్తీసారా.. మరికొందరికి అస్వస్థత

Bengal Liquor Deaths'

Bengal Liquor Deaths'

Bengal Liquor Deaths: పశ్చిమబెంగాల్‌లో కల్తీసారా ఏడుగురిని కబళించింది. హౌరాలో కల్తీసారా సేవించి 7 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. హౌరాలో ఓ బస్తీలో ఈ ఘటన జరిగింది. బస్తీలో విక్రయించిన సారా తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 7గురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. కాగా, కొన్ని మృతదేహాలకు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పలువురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపాయి. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల స్పష్టమైన కారణాలను తెలుసుకోవచ్చునని హౌరా పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ త్రిపాఠి తెలిపారు.

Explosion at Hoover Dam: అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ వద్ద పేలుడు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలిపంచఘోర ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా లిక్కర్ షాపు నడుపుతున్నాడు. స్థానిక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు రోజూ ఈ లిక్కర్ షాప్​కు వెళ్లి తాగేవారు. బస్తీవాసులు అస్వస్థతకు గురైన రోజు కూడా ఇక్కడే మద్యం సేవించారు. ఈ క్రమంలోనే కొందరు మరణించారు. దీంతో ఆల్కహాల్ షాపు యజమానిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల శవపరీక్షల నివేదికలు అందిన తర్వాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version