Site icon NTV Telugu

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి

Rajasthan

Rajasthan

రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝలావర్‌లో శుక్రవారం ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పాఠశాల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పాఠశాల భవనం కూలిపోయిన సమయంలో 60-70 మంది పిల్లలు చిక్కుకున్నట్లు అనుమానం.

ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. ప్రస్తుతం ఏడుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటిదాకా కళ్ల ముందు తిరిగిన పిల్లలు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో రోదనలు మిన్నింటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి.. అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది.

అధికారుల నివేదిక ప్రకారం.. రాజస్థాన్‌లోని ఝలావర్‌లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోయినట్లుగా చెప్పారు. 60 మందికి పైగా పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించారు. క్రేన్ల సహాయంతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.

Exit mobile version