NTV Telugu Site icon

Spicejet employee: వివాదం అవుతున్న జైపూర్ ఎయిర్‌పోర్టు ఘటన.. ఏం జరిగిందంటే..!

Jagoe

Jagoe

జైపూర్ ఎయిర్‌పోర్టులో ఇటీవల జరిగిన సంఘటన తీవ్రం అవుతోంది. విమానాశ్రాయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. భద్రతా సిబ్బంది ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. భద్రతా అధికారి తనను లైంగిక వేధించారని సంచలన ఆరోపణ చేశారు. ఉదయం పూట చెకింగ్ సమయంలో మహిళా భద్రతా సిబ్బంది ఎవరూ లేరని.. ఆ సమయంలో అధికారి.. తనను ఒక రాత్రికి ఎంత వసూలు చేస్తావని అడిగాడని.. అంతేకాకుండా లైంగిక వేధించాడని ఆమె ఆరోపించింది.

ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. ఒక్క వికెట్ నష్టపోకుండా విక్టరీ

స్పైస్‌జెట్ ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 11న జైపూర్ ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున 4:30 గంటలకు ఏఎస్సై గిరిరాజ్ ప్రసాద్.. తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని.. అశ్లీలంగా సంభాషించాడని పేర్కొంది. తాను స్పైస్ జెట్‌లో ఐదేళ్ల నుంచి పని చేస్తున్నట్లు తెలిపారు. నియమాలు, నిబంధనలు తనకు తెలుసన్నారు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లే అర్హతలు, చెల్లుబాటు అయ్యే కార్డు ఉందని చెప్పినట్లు వెల్లడించారు. ఈ ఘటన జరిగే సమయంలో మహిళా సిబ్బంది లేదని చెప్పారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే కొట్టినట్లు స్పైస్ జెట్ మహిళా ఉద్యోగి తెలిపారు. ఇదిలా ఉంటే విమాన సంస్థ.. ఉద్యోగి అండగా నిలిచింది. లైంగిక వేధించిన భద్రతా అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఉద్యోగికి అన్ని విధాలా సహాయ సహకారలు అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Italy: బానిస బతుకు నుంచి 33 మంది భారతీయ కార్మికులకు విముక్తి..