Site icon NTV Telugu

The Indrani Mukerjea Story: “షీనాబోరా హత్య”పై నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి హైకోర్టు అనుమతి.. అసలేంటీ ఈ కేసు..?

The Indrani Mukerjea Story The Buried Truth

The Indrani Mukerjea Story The Buried Truth

The Indrani Mukerjea Story: 2012లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది షీనాబోరా హత్య- ఇంద్రాణి ముఖర్జియా కేసు. సొంత తల్లి తన కూతురిని హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విడుదలపై స్టే ఇవ్వాలని విచారణ సంస్థ సీబీఐ బాంబే కోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ పిటిషన్‌ని కొట్టేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ విడుదలకు మార్గం సుగమమైంది.

తాము ఈ సిరిస్ చూశామని ఇందులో విచారణకు, ప్యాసిక్యూషన్‌కి భంగం కలిగించే అంశాలు లేవని బెంజ్ పేర్కొంది. ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ పేరుతో డాక్యుమెంట్-సిరీస్ 25 ఏళ్ల షీనా బోరా అదృశ్యం, హత్య గురించి వివరిస్తుంది. నిజానికి దీన్ని ఫిబ్రవరి 23నే స్ట్రీమింగ్ చేయాల్సి ఉన్నా..సీబీఐ అధికారులు, న్యాయవాదుల కోసం ఈ సిరీస్ ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించాలని బెంచ్ గత వారం నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. గురువారం (ఫిబ్రవరి 29) వరకు సిరీస్‌ను ప్రసారం చేయబోమని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. గురువారం సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ మాట్లాడుతూ, ఈ సిరీస్ న్యాయం మరియు న్యాయమైన విచారణను పక్షపాతం చేస్తుందని అన్నారు. ఇది న్యాయవ్యవస్థ మనస్సును ప్రభావితం చేసే ప్రజా అవగాహనను సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సిరీస్‌ను తాము కూడా చూశామని, ఈ సిరీస్‌కు వ్యతిరేకంగా సీబీఐ తన డిమాండ్‌ను ఒత్తిడి చేయదని భావించామని హైకోర్టు పేర్కొంది.

Read Also: Nizams’s Petrol Pump : బయటపడ్డ నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు

అసలేంటీ ఈ కేసు:

ముంబై మెట్రో వన్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల షీనా బోరా ఏప్రిల్24, 2012లో ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమైంది. అయితే, అనూహ్యంగా షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియానే తన కూతురును హత్య చేసినట్లు 2015లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జియా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్‌ ఈ హత్యలో పాలు పంచుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారం ఆ సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

షీనా బోరాను 2012 ఏప్రిల్‌లో కారులో ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిస కారులో గొంతుకోసి హత్య చేశారు. విచారణలో ఖన్నా, రాయ్ నేరాన్ని అంగీకరించారు. అయితే, ఇంద్రాణి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. షీనా జీవించి ఉందని, అమెరికాలో నివసిస్తుందంటూ నమ్మబలికింది. అయితే నిందితుడు శ్యాంవర్ రాయ్ హత్య గురించిన వివరాలు వెల్లడించారు. మృతదేహాన్ని పారేయడం కోసం ముందు రోజే సర్వే చేసినట్లు, హత్య తర్వాత మృతదేహాన్ని వర్లీలోని ఇంద్రాణి నివాసానికి తరలించి, అక్కడ ఒక బ్యాగ్‌లో దాచిపెట్టి, కారు ట్రంక్‌లో పెట్టుకుని మహారాష్ట్రలోని గడోడ్ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని కాల్చేశారు.

ఈ వ్యవహారంలో ముఖర్జీ కుటుంబానికి చెందిన అనేక చీకటి రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. షీనా బోరా తన సవతి సోదరుడు రాహుల్‌తో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాహుల్ ఇంద్రానీ ముఖర్జీ రెండో భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య చిన్న కొడుకు. ఆర్థిక వివాదాలు, రాహుల్‌తో షీనా సంబంధాన్ని ఇంద్రాణి వ్యతిరేకించడం హత్యకు కారణమని సీబీఐ పేర్కొంది. ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ పేరుతో డాక్యుమెంట్-సిరీస్, షీనా బోరా అదృశ్యం గురించి వివరిస్తుంది మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 29 న ప్రదర్శించబడుతుంది.

Exit mobile version