NTV Telugu Site icon

Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం..

Maoist

Maoist

Maoist: వరస ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 100కు పైగా మావోయిస్టులు హతమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారు.

Read Also: MLC Kavitha: హెచ్సీయూ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపిందే బీఆర్ఎస్..

ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో హత్యాకాండలను ఆపాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ఒప్పుకుంటే, తాము శాంతి చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. ఈమేరకు మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అజయ్ పేరిట లేఖ విడుదలైంది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృ‌ష్టించాలని లేఖలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా స్పందించాలని కోరారు.

2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చెప్పారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ కగార్’’ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో కూడా మావోయిస్టులు హతమవుతున్నారు. గత మూడు నెలల్లో మహారాష్ట్ర ,జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు శాంతిచర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాదులో శాంతి చర్చకు సంబంధించి మేధావులు మానవ హక్కుల సంఘాలు పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు లేఖను విడుదల చేసింది.