National Security Advisory Board: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘జాతీయ భద్రతా సలహా బోర్డు’’(National Security Advisory Board)ని పునరుద్ధరించింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అలోక్ జోషి దీనికి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AW’’ కి గతంలో జోషి చీఫ్‌గా పనిచేశారు. సాయుధ దళాలు, పోలీస్ సర్వీస్, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అయిన అధికారులతో కూడి ఏడుగురు సభ్యులు బోర్డుకు నాయకత్వం వహిస్తారు.
Read Also: Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..
గతంలో సైనిక సేవల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ PM సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ AK సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా బోర్డులో భాగంగా ఉన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) నుండి ఇద్దరు రిటైర్డ్ అధికారులు – రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుండి రిటైర్డ్ అధికారి B వెంకటేష్ వర్మ బోర్డులో భాగం కాననున్నారు.
ఇటీవల, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు టూరిస్టులను కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడిలో పాకిస్తాన ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో భారత్, పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుతున్నారు. దీంతో, ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రం మొత్తం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ జీవనాడి ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులు వీసాలు రద్దు చేసింది. సైనిక చర్యకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
