కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. 30.08.2024 నుంచి రెండు సంవత్సరాల పాటు కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్ కొనసాగనున్నారు. సోమనాథన్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
ఇది కూడా చదవండి: TG Vishwaprasad: ‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్.. అందుకే ఆగస్టు 15కి వస్తున్నాం: నిర్మాత విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ
సోమనాథన్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజీవ్ గౌబా స్థానంలో సోమనాథన్ కేబినెట్ సెక్రటరీగా నియమితులయ్యారు. సోమనాథన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మరియు వ్యయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 30 నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించే వరకు కేబినెట్ సెక్రటేరియట్‌లో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా కూడా సోమనాథన్ పని చేస్తారని అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. రాజీవ్ గౌబా ఐదేళ్ల క్రితం ఆగస్టు 30, 2019న కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన పదవీకాలం ఇప్పటికే ముగిసింది. అయినా కూడా రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మూడుసార్లు పొడిగించారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఇండియా ఆలోచించాలి.. బంగ్లాదేశ్ పార్టీ నేత..