NTV Telugu Site icon

Nitin Gadkari: రాంగ్ పార్కింగ్‌పై కఠిన చట్టం.. ఫోటో పంపితే రూ.500 రివార్డు

No Parking Min

No Parking Min

దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాంగ్‌ పార్కింగ్‌ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్‌ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వాహనాల పార్కింగ్ సమస్యలపై ప్రసంగించారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్‌ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. రాంగ్ పార్కింగ్‌తో తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయని.. రాంగ్ పార్కింగ్‌కు తప్పనిసరిగా అడ్డుకట్ట వేస్తామన్నారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫోటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డుగా ఇస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు.

Nupur Sharma: నా అడ్రస్ తెలుపొద్దు.. మీడియాకు నుపుర్ రిక్వెస్ట్