సోషల్ మీడియా వచ్చాక కులాంతర వివాహాలే కాదు దేశాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే అది తప్పేమి కాదు. కానీ పెళ్ళై భర్త పిల్లలు ఉన్న మహిళలు, భార్య పిల్లలు ఉన్న పురుషులు కూడా సోషల్ మీడియా వేదికగా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ఆపైన నమ్ముకున్న వాళ్ళని వదిలి దేశాలు ధాటి సోషల్ మీడియా ప్రేమని చేరడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ కోవలోకే వస్తుంది పాకిస్తాన్ కి చెందిన సీమా హైదర్. ఆరు నెలల క్రితం భర్తను వదిలి పిల్లల్ని తీసుకుని సీమా హైదర్ నేపాల్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఆమెను ఆమె ప్రియుడు సచిన్ మీనాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read also:Pawan Kalyan: ఎక్కడ ఉన్నాడో పట్టుకొని కొన్ని ఫోటోలు దింపండయ్యా..
అనంతరం అన్ని గొడవలు సద్దుమణిగిన తర్వాత సీమా హైదర్ సచిన్ మీనాతో కలిసి రబూపురాలో నివసించడం ప్రారంభించింది. అయితే ఆమె భారత దేశానికి వచ్చిన తరువాత మొదటి సారిగా కడ్వా చౌత్ పండుగ జరుపుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో సీమ సంతోషం వ్యక్తం చేస్తూ.. భారతదేశం చాలా మంచి దేశమని.. ఇతర దేశాల ప్రజలను తన సొంతం చేసుకోవడం ద్వారా వారికి ఎంతో గౌరవం ఇస్తుందని అన్నారు. అలానే ఆమెకు వాళ్ళ అమ్మ పంపిన వస్తువులను కూడా ప్రేక్షకులకు చూపించారు.
