NTV Telugu Site icon

Pathankot: పఠాన్‌ కోట్‌లో హైఅలర్ట్‌.. టెర్రరిస్టుల కోసం గాలింపు

Hi Alert

Hi Alert

ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న దృశ్యాలతో పఠాన్‌ కోట్‌లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో భారత వాయుసేన కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు అప్రమత్తం అయి తనిఖీలు చేపట్టాయి. టెర్రరిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. అణువణువూ భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి అనుమానాసస్పద కదలికలు గుర్తించినట్లు సరిహద్దు రేంజ్ డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ రాకేశ్ కౌశల్ తెలిపారు. దీంతో భద్రతా దళాలను అలర్ట్ చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి భయాందోళన అవసరం లేదని.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామన్నారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: 6,000 ఏళ్ల కథ.. 600 కోట్ల బడ్జెట్.. తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ లేకుండానే టికెట్ దొరకనంత క్రేజ్!

ఇక పఠాన్‌కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీం మిర్‌ మాట్లాడుతూ.. ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దులు పంచుకొంటోందన్నారు. ఈ అనుమానితులే కథువాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు తెలిసిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Lok sabha: ఎమర్జెన్సీపై 2 నిమిషాల మౌనం.. విపక్షాల ఆందోళన.. వాయిదా