NTV Telugu Site icon

Chandigarh: అంబేద్కర్ అంశంపై రగడ.. కొట్టుకున్న కౌన్సిలర్లు

Chandigarh

Chandigarh

అంబేద్కర్‌‌పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. బదులుగా జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ బీజేపీ ఆరోపించింది. ఇలా ఇరువర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. దీంతో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Dil Raju : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటా

రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్‌ కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో పుణ్యమైన దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. తాజాగా ఇదే అంశంపై చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా రిపీట్ అయింది. కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసును ఉదహరిస్తూ నామినేటెడ్ కౌన్సిలర్ అనిల్ మాసిహ్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారని పేర్కొన్నారు. ఇంతలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు.

 

Show comments