Site icon NTV Telugu

అలర్ట్: కరోనా ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి 

కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.  రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  బి.1.617, బి.1.618 తో పాటుగా ఎన్ 440 కె రకం వేరియంట్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.  కరోనా మహమ్మారి వ్యాప్తిపై చేసిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.  మొదటి దశలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా, రెండో దశలో ఒకటి నుంచి ఏకంగా ముగ్గురికి వ్యాపిస్తున్నట్టు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ సంస్థల పరిశోధనలో తేలింది.  వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, మహమ్మారి ఎంత తీవ్రంగా ఉన్నదో చెప్పేందుకు మరణాలే నిదర్శనం అని పరిశోధకులు చెప్తున్నారు.  

Exit mobile version