కరోనా మహమ్మారితో స్కూళ్లు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకపోగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. ఇప్పట్లో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.. కొన్ని రాష్ట్రాలకు క్లాసుల నిర్వహణకు సిద్ధం అయినా.. థర్డ్ వేవ్ వార్నింగ్‌లతో వెనక్కి తగ్గారు.. అయితే, ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందనే సూచనలు అంతర్జాతీయంగా కనబడుతున్నాయని.. ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే దాకా పిల్లలకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోబోమని క్లారిటీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. స్కూళ్లు తెరుస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “లేదు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారం, థర్డ్ వేవ్ వచ్చేస్తోంది.. కాబట్టి మొత్తం జనాభాకు టీకాలు వేయడం పూర్తయ్యే వరకు మేం పిల్లలను ప్రమాదంలోకి నెట్టబోమన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసు భారీగా తగ్గాయి.. సుమారు రెండు వారాలుగా 100 లోపే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
స్కూళ్లు తెరవం.. రిస్క్ తీసుకోం..

Arvind Kejriwal