Site icon NTV Telugu

School Van Accident: స్కూల్‌ వ్యాన్‌ ను ఢీ కొట్టిన లారీ.. నలుగురు విద్యార్థులు మృతి

School Van Accident

School Van Accident

చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్‌ కు బయలు దేరారు. కానీ.. మృత్వువు వారికి కబలించింది. వాన్‌ రూపంలో చిన్నారులను బలికొంది. రాంగ్‌ రూట్‌ వచ్చిన లారీ చిన్నారులు వెళుతున్న స్కూల్‌ వ్యాన్‌ ను ఢీ కొట్టడంతో.. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలో ఓ కాన్వెంట్‌ వ్యాన్‌ పిల్లలతో స్కూల్‌కు బయలుదేరింది. మార్గ మధ్యలో రాంగ్‌ రూట్‌ వస్తున్న లారీ స్కూల్‌ వ్యాన్‌ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద సబ్దం, పిల్లలందరూ చెల్లాచెదరయ్యారు. ఆదారి అంతా రక్తసిక్తమైంది. కల్లు తెరచి చూసే సరికి పలువురు గాయపడితే.. మరికొందరు మృత్యువాత పడ్డారు. పిల్లల ఆర్తనాదాలు. అమ్మ అంటూ ఆ చిన్నారులు బాధతో విలవిలలాడుతున్నారు. స్కూల్‌ వ్యాన్‌ నుజ్జు నుజ్జు అయ్యింది.

స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారులను సమీప ఆసుత్రికి తరలించారు. ఆంబులెన్స్‌ కాల్‌ చేసిన స్పందించకపోవడంతో.. విద్యార్థులను ఉజ్జయిని వైపు వెళుతున్న ఓ బస్సులో చికిత్సకోసం తరలించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్పుడే స్కూల్‌ వెళ్లిన చిన్నారులు ఘటనకు లోనవడంతో.. కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచార నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.

మ‌ధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఉజ్జయినీ ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉజ్జయిని సమీపంలోని నగ్డాలో పాఠశాల పిల్లల వాహనం ప్రమాదంలో చాలా హృదయ విదారక వార్త అందిందని ట్వీట్‌ చేశారు. క్షతగాత్రులందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని, భగవంతుడు పాదాల చెంత మరణించిన విద్యార్థుల ఆత్మలకు చోటు కల్పించాలని ఆయన కోరారు.

Exit mobile version