School Van Accident: స్కూల్ వ్యాన్ ను ఢీ కొట్టిన లారీ.. నలుగురు విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్ కు బయలు దేరారు. కానీ.. మృత్వువు వారికి కబలించింది. వాన్ రూపంలో చిన్నారులను బలికొంది. రాంగ్ రూట్ వచ్చిన లారీ చిన్నారులు వెళుతున్న స్కూల్ వ్యాన్ ను ఢీ కొట్టడంతో.. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలో ఓ కాన్వెంట్ వ్యాన్ పిల్లలతో స్కూల్‌కు బయలుదేరింది. మార్గ మధ్యలో రాంగ్ రూట్ వస్తున్న లారీ స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద సబ్దం, పిల్లలందరూ చెల్లాచెదరయ్యారు. ఆదారి అంతా రక్తసిక్తమైంది. కల్లు తెరచి చూసే సరికి పలువురు గాయపడితే.. మరికొందరు మృత్యువాత పడ్డారు. పిల్లల ఆర్తనాదాలు. అమ్మ అంటూ ఆ చిన్నారులు బాధతో విలవిలలాడుతున్నారు. స్కూల్ వ్యాన్ నుజ్జు నుజ్జు అయ్యింది.
స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారులను సమీప ఆసుత్రికి తరలించారు. ఆంబులెన్స్ కాల్ చేసిన స్పందించకపోవడంతో.. విద్యార్థులను ఉజ్జయిని వైపు వెళుతున్న ఓ బస్సులో చికిత్సకోసం తరలించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్పుడే స్కూల్ వెళ్లిన చిన్నారులు ఘటనకు లోనవడంతో.. కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచార నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉజ్జయినీ ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉజ్జయిని సమీపంలోని నగ్డాలో పాఠశాల పిల్లల వాహనం ప్రమాదంలో చాలా హృదయ విదారక వార్త అందిందని ట్వీట్ చేశారు. క్షతగాత్రులందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని, భగవంతుడు పాదాల చెంత మరణించిన విద్యార్థుల ఆత్మలకు చోటు కల్పించాలని ఆయన కోరారు.
उज्जैन के पास नागदा में स्कूली बच्चों के वाहन दुर्घटनाग्रस्त होने की अत्यंत हृदयविदारक समाचार प्राप्त हुआ है। मैं सभी घायलों की कुशलता की प्रार्थना करता हूं।
प्रभु दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान दें।।। ॐ शांति ।।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 22, 2022
తాజావార్తలు
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?