Site icon NTV Telugu

Madhya Pradesh: గవర్నమెంట్ టీచర్ ఆస్తులు చూసి షాకైన అధికారులు

మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆస్తులు చూసి అధికారులు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఘాటిగావ్‌కు చెందిన ప్రశాంత్‌ పర్మార్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‍గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం వేలల్లో మాత్రమే ఉంటుంది. అయితే అతడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో అతడి నివాసంతో పాటు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు.

అయితే ఈ సోదాల్లో ప్రశాంత్ పర్మార్ ఆస్తుల జాబితా అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రశాంత్‌ పర్మార్‌కు గ్వాలియర్‌, చంబల్‌ ప్రాంతంలో 20 బీఈడీ, డీఈడీ కాలేజీలు, 3 నర్సింగ్‌ కాలేజీలు, 4 ఆఫీసులు ఉన్నట్లు అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. అతడి ఆస్తుల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. ఆయా ఆస్తుల విలువ ఆయన సంపాదనతో పోల్చి చూస్తే 1000 రెట్ల కంటే ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 2006లో గవర్నమెంట్ టీచర్‌గా విధుల్లో చేరినప్పుడు ప్రశాంత్ పర్మార్ నెల జీతం రూ.3,500. అయితే కొద్దికాలంలోనే అతడు ఈ స్థాయికి రావడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేశాడో అని అధికారులు షాక్‌కు గురయ్యారు.

https://ntvtelugu.com/jharkhand-congress-leader-bandhu-tirkey-gets-3-year-jail-term-in-disproportionate-assets-case/
Exit mobile version