Site icon NTV Telugu

Viral Video: ఐటమ్ సాంగ్‌కి క్లాస్‌రూంలో టీచర్ డ్యాన్స్.. వీడియో వైరల్..

Teacher Dance

Teacher Dance

Viral Video: క్లాస్ రూపంలో మహిళా టీచర్ బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ప్రోత్సహిస్తుంటే ఆమె డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘బంటీ ఔర్ బబ్లీ’’ సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన కజ్‌రారే పాటకు సదరు ఉపాధ్యాయురాలు చిందులేసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి రెడ్ దుపట్టాను టీచర్‌పై కప్పడం వీడియోలో చూడవచ్చు. టీచర్ బర్త్ డే సందర్భంగా స్టూడెంట్స్ బోర్డుపై విషెస్ చెప్పినట్లు కనిపిస్తోంది. బోర్డుపై హ్యాపీ బర్త్‌డే రష్మీ మేడమ్ అని రాసి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎక్స్‌లో ఈ పోస్టుకు 300 లైక్స్, మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Read Also: S Jaishankar: ఉక్రెయిన్‌పై అణు దాడిని నివారించడానికి ప్రధాని మోడీ సహాయం చేశారా?

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీచర్ వృత్తిలో ఉండీ ఇలా ఐటమ్ పాటలకు డ్యాన్స్ చేయడమేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే దేశంలో ఇలా తరగతి గదిలో డ్యాన్స్ చేయడం సరికానది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు టీచర్ డ్యాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు, ఓపెన్ మైండెడ్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొంతమంది ఇతరులు సంతోషంగా ఉండటం చూడలేరు, ఆమె టీచర్ అయినందుకు ఆమెకు డ్యాన్స్ చేసే అర్హత లేదా..? అని ఓ నెటిజన్ ఆమెకు మద్దతు తెలిపాడు.
https://twitter.com/yeazlas/status/1768828567058813003

Exit mobile version