NTV Telugu Site icon

Savarkar: సావర్కర్‌ని గుర్తు చేసిన ప్రధాని మోడీ.. ఫ్రాన్స్‌కి ఏం సంబంధం, బ్రిటీష్ ఓడ నుంచి ఎలా తప్పించుకున్నాడు..

Savarkar To France's Marseille

Savarkar To France's Marseille

Savarkar: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఈ రోజు మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. అయితే, దీనికి ముందు మార్సెయిల్ నగరానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ ఐకాన్ వీడి సావర్కర్‌కి ఉన్న సంబంధం గురించి తెలిపారు. “మార్సెయిల్‌లో అడుగుపెట్టాను. భారతదేశ స్వాతంత్ర్య అన్వేషణలో, ఈ నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గొప్ప వీర్ సావర్కర్ ధైర్యంగా తప్పించుకోవడానికి ఇక్కడే ప్రయత్నించాడు” అని ట్వీట్ చేశారు. “ఆయనను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసిన మార్సెయిల్ ప్రజలకు మరియు ఆనాటి ఫ్రెంచ్ కార్యకర్తలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీర్ సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది” అని చెప్పారు.

Read Also: Spirit: ప్రభాస్ తో కలిసి నటించాలని అనుకుంటున్నారా.. మీకే బంపర్ ఆఫర్?

సావర్కర్ ఎలా తప్పించుకున్నాడు, ఆ స్టోరీ ఏంటి..?

మార్చి 1910లో భారత స్వాతంత్య్రోద్యమం సమయంలో ఆయుధాల సేకరణ, పంపిణీ, దేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలపై లండన్‌లో సావర్కర్‌ని బ్రిటీష్ వారు అరెస్ట్ చేశారు. ఒక విచారణ కోసం అక్కడి నుంచి భారత్ తీసుకువెళ్తున్న క్రమంలో తప్పించుకున్నారు. సావర్కర్ ఇంగ్లాండ్ నుండి ఆడెన్ (ఆధునిక యెమెన్) కు ప్రయాణిస్తున్న బ్రిటిష్ ఓడ ఎస్ఎస్ మోరియా నుంచి తప్పించుకుని సముద్రంలో ఈదుకుంటూ మార్సెయిల్ నగరానికి చేరుకున్నాడు. బ్రిటీష్ వారికి తిరిగి అప్పగించే ముందు ఫ్రెంచ్ అధికారులు కొంతకాలం నిర్భందించారు. ఫ్రాన్స్ సావర్కర్‌ని బ్రిటీష్ వారికి తిరిగి అప్పగించింది. ఆయనను అండమాన్ నికోబార్‌లోని సెల్యులర్ జైలుకి తరలించారు.

లండన్‌కు పశ్చిమాన థేమ్స్ నది ఒడ్డున ఉన్న టిల్బరీ డాక్స్ నుండి బయలుదేరిన తర్వాత, సావర్కర్‌ను తీసుకెళ్తున్న ఎస్ఎస్ మోరియా జూలై 7న మార్సెయిల్స్‌కు చేరుకుంది. ఆ సమయంలో మార్సెయిల్స్ భారతీయ విప్లవకారులకు కేంద్రంగా ఉంది. శ్యామ్‌జీ కృష్ణ వర్మ, మేడమ్ భికైజీ కామా, సర్దార్ సింగ్ రాణా, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ వంటి ప్రముఖ భారతీయ విప్లవకారులు ఫ్రాన్స్‌లో చురుకుగా పనిచేసేవారు.

Read Also: Spirit: ప్రభాస్ తో కలిసి నటించాలని అనుకుంటున్నారా.. మీకే బంపర్ ఆఫర్?

ఎలా తప్పించుకున్నాడు..?

సావర్కర్‌ని బ్రిటిష్ అధికారులు పవర్, పార్కర్ అనే ఇద్దరు భారతీయ హెడ్ కానిస్టేబుల్స్, పూనా పోలీస్ నుంచి మహ్మద్ సిద్ధిక్, నాసిక్ పోలీసులు అమర్‌సింగ్ సఖారాసింగ్ ఎస్కార్ట్‌గా వెళ్లారు. సావర్కర్ భద్రత కోసం భారతదేశం నుండి ప్రత్యేకంగా పంపబడిన మూడవ అధికారి ఉస్మాన్ ఖాన్ జూన్ 1910లో ఇంగ్లాండ్‌లో మరణించాడు. పవర్ తన విధుల్ని సిద్ధిక్, అమర్ సింగ్‌లకు అప్పగించారని ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ తన బుక్ ‘‘‘సావర్కర్, ఎకోస్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ పాస్ట్, 1883-1924’’లో రాశారు.

టాయిలెట్‌కి వెళ్లినా, నడిచే సమయంలో కూడా గార్డులు సావర్కర్‌‌పై నిఘా ఉంచేవారు. జూలై 8, 1910న ఉదయం 6.15 గంటలకే టాయిలెట్ వెళ్లాలని సావర్కర్ అభ్యర్థించారు. పన్నెండు అంగుళాల వ్యాసం కలిగిన పోర్త్ హోల్ తెరిచి ఉందని గ్రహంచిన అందులోంచి సముద్రంలోకి దూకాడు. ఆ తర్వాత సావర్కర్ తప్పించుకున్నట్లు కానిస్టేబుల్స్ గ్రహించారు.

అయితే, సావర్కర్ తన సహచరుల వద్దకు వెళ్లే లూపే హెడ్ కానిస్టేబుల్స్, ఫ్రెంచ్ జెండర్మెరీ మారిటైమ్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నారు. పట్టుబడిన తర్వాత తనకు సాయం చేయాలని, మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లాలని ఫ్రెంచ్ సిబ్బందిని కోరాడు. సావర్కర్ ఫ్రెంచ్ అధికార పరిధిలోకి వస్తానని సావర్కర్ భావించాడు. అయితే, ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో సావర్కర్ చేసిన విజ్ఞప్తిని అర్థం చేసుకోలేకపోయాడు.

దీని తర్వాత సావర్కర్‌ని తిరిగి ఓడలోకి తీసుకెళ్లి, మళ్లీ సంకేళ్లు వేసి తరలించారు. నౌక జూలై 9న మార్సెయిల్స్ నుండి బయలుదేరి జూలై 17న అడెన్‌కు చేరుకుంది, అక్కడ నుంచి జూలై 22, 1910న బొంబాయి చేరుకుంది. ఫ్రాన్స్‌లో సావర్కర్‌ను బంధించి బ్రిటిష్ వారికి అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తమైంది, ఫ్రెంచ్ పత్రికల్లోని కొన్ని వర్గాలు దీనిని జాతీయ కుంభకోణం అని పిలిచాయి. ఫ్రాన్స్ చాలా కాలంగా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం యొక్క ఆదర్శాలను సమర్థించినందున ఈ సంఘటన ముఖ్యంగా వివాదాస్పదమైంది.

భారతదేశానికి వచ్చిన తరువాత, సావర్కర్‌ను విచారించి రెండు జీవిత ఖైదులు, మొత్తం 50 సంవత్సరాలు శిక్ష విధించి, అండమాన్ మరియు నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలుకు పంపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత అతను చివరికి 1924లో విడుదలయ్యాడు.